
తెనాలి: Ksk విద్యా సంస్థల CEO డా. డేవిడ్ యశ్వంత్ అధ్యక్షతన, హార్వెస్ట్ ఇండియా సంస్థ సిబ్బంది ఆధ్వర్యంలో సేవ రత్న సుద్దపల్లి నాగరాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవ, సమాజ హితం ప్రధాన లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపట్టారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. డేవిడ్ యశ్వంత్ మాట్లాడుతూ, సుద్దపల్లి నాగరాజు నిరంతరం సమాజ సేవలో ముందుంటూ పేదలు, అవసరమైన వారికి అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో పనిచేస్తున్న వ్యక్తులు యువతకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.
హార్వెస్ట్ ఇండియా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, సేవ రత్న నాగరాజు చేపట్టిన అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేకూర్చాయని తెలిపారు. విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన రంగాల్లో ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయం అని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించేందుకు సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
ఈ వేడుకలలో భాగంగా పేదలకు ఆహార పంపిణీ, అవసరమైన వారికి సహాయ సామగ్రి అందజేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. జన్మదిన వేడుకలు ఆత్మీయ వాతావరణంలో, సేవా సందేశంతో సాగాయి.
ఈ కార్యక్రమంలో KSK విద్యా సంస్థల ప్రతినిధులు, హార్వెస్ట్ ఇండియా సంస్థ సిబ్బంది, సేవాభిమానులు, పలువురు ప్రముఖులు పాల్గొని సుద్దపల్లి నాగరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఉపయోగపడాలనే సందేశంతో వేడుకలు ముగిశాయి.








