chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన కార్యకర్తలకు ప్రశంసాపత్రాలు అందజేసిన-ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మరాజు

బాపట్ల :- నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమాన్ని మై టీడీపీ యాప్ ద్వారా విజయవంతంగా అమలు చేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపుగా ప్రశంసాపత్రాల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పాల్గొని కార్యకర్తలకు స్వయంగా ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు గారు మాట్లాడుతూ, టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తూ ముందుగా గుర్తింపు పొందిన కార్యకర్తలతో పాటు, ప్రతి కార్యకర్త కూడా పార్టీకి బలమని తెలిపారు. పార్టీ కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికీ విడతలవారీగా న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

వచ్చే ఏడాదిలో కార్యకర్తలకు మరింత ప్రాధాన్యత కల్పిస్తూ, వారి పాత్రను మరింత బలోపేతం చేసే విధంగా కార్యాచరణ చేపడతామని ఆయన వెల్లడించారు. కార్యకర్తలే పార్టీకి పునాది అని, వారి కృషి వల్లే తెలుగుదేశం పార్టీ ప్రజల్లో మరింత బలంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.Bapatla Local News

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker