
గుంటూరు, అక్టోబరు 14 : సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ గుంటూరు ఉత్సవ్ ను నిర్వహిస్తున్నట్లు జిఎస్టి జాయింట్ కమిషనర్ బి.గీత మాధురి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గుంటూరు జిల్లా ఉత్సవ్ కు ప్రత్యేకంగా లోగో తయారు చేయడం జరిగిందని చెప్పారు.
జి.ఎస్.టి 2.0 పై వినియోగదారులకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు గుంటూరు జిల్లా ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు ఏ.సి కళాశాల ఆడిటోరియం హాల్ లో ఉత్సవ్ జరుగుతుందని అన్నారు. 16వ తేదీ ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్, అమ్మ కాలు జరుగుతాయన్నారు. గృహోపకరణాలు,క్రీడా పరికరాలు, జిమ్ ఫిట్నెస్, సోలార్, బుక్స్ స్టేషనరీ, కెమిస్ట్ డ్రగ్గిస్ట్,
అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులు తదితర వాటికి సంబంధించిన దాదాపు 70 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. జిల్లా ప్రజలు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.







