
విజయవాడ, అక్టోబర్ 23:-సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి గారిపై జరిగిన అనాగరిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ, రాష్ట్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు గాంధీనగర్ ప్రెస్ క్లబ్, విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ మరియు వాటి అనుబంధ సంఘాల నాయకులు సుమారు 30 మంది హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో డా. మున్నంగి నాగరాజు మాదిగ (ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు & PRO PDF), సొటా నరేంద్ర మాదిగ (ఎంఎస్‌పీ జాతీయ నాయకులు), వైకే. విశ్వనాద్ మాదిగ (ఎంఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షులు), మంద వెంకటేశ్వరరావు మాదిగ, కోట డానియల్ మాదిగ, పేరెల్లి ఎలీషా మాదిగ (ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), ఆదిమూలపు ప్రకాష్ మాదిగ (ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి), జలదంకి నర్సింగ్‌రావు మాదిగ (కృష్ణా జిల్లా ఇన్‌చార్జి) తదితరులు పాల్గొన్నారు.మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ —దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలం ఇచ్చేది న్యాయవ్యవస్థ అని పేర్కొన్నారు. అలాంటి న్యాయవ్యవస్థ ప్రతీక అయిన సుప్రీంకోర్టు జస్టిస్ గవాయి గారిపై దాడి జరగడం దళితులపై అవమానంగా భావించాల్సిన విషయం అని అన్నారు. ఇప్పటివరకు ఎటువంటి దళిత నాయకుడు దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని, అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయకపోవడం బాధాకరమని విమర్శించారు.“మహారాష్ట్రలో అంబేద్కర్ గారి మనవడు ఉన్నారు, మాయావతి గారు ఉన్నారు, కేంద్రంలో దళిత మంత్రులు ఉన్నారు — అయినా ఎవరూ దాడి చేసిన వారిపై చర్య కోరలేదు” అని మండిపడ్డారు.
అయన కొనసాగిస్తూ —
“ఈ దాడిని ఖండించడం మాత్రమే కాదు, దాడి చేసిన వ్యక్తిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. ఈ బాధ్యత ఎమ్మార్పీఎస్ తీసుకుంటుంది,” అని స్పష్టం చేశారు.నవంబర్ 1న హైదరాబాదులో “దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన” పేరుతో భారీ ఖండన కార్యక్రమం నిర్వహించి, అదే రోజు “చలో ఢిల్లీ” ప్రోగ్రామ్ ప్రకటిస్తామని తెలిపారు.రాజకీయ నాయకుల స్పందనపై వ్యాఖ్యానిస్తూ మందకృష్ణ మాదిగ చెప్పారు —“ప్రధానమంత్రి గారు సిజే గారితో మాట్లాడి స్పందించారు, అలాగే మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గార్లు కూడా ఖండించారు. కానీ దాడి చేసిన వ్యక్తిపై సుమోటోగా కేసు నమోదు చేయలేదు. దానికి గల కారణం సనాతన ధర్మవాదుల ఒత్తిడే” అని అన్నారుజార్ఖండ్ ఉదాహరణ ప్రస్తావిస్తూ —“అక్కడ కేవలం సంభాషణకే న్యాయవాదిపై సుమోటోగా కేసు నమోదు చేశారు. కానీ ఇక్కడ న్యాయమూర్తిపై దాడి జరిగినా స్పందన లేదు” అని మండిపడ్డారు.గవాయి గారి సేవలు గుర్తు చేస్తూ —
“సీజేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్‌పై సంతకం చేసిన తొలి న్యాయమూర్తి గవాయి గారు. అదే కొందరికి అసహనం కలిగించింది. మహారాష్ట్ర పర్యటనలో కూడా ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వలేదు. అయినా ఆయన పెద్ద మనసుతో వదిలేశారు” అని తెలిపారు.చివరగా, “చీఫ్ జస్టిస్ గవాయి గారిపై దాడి చేసిన వారిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. దీని వెనుక ఉన్నవారిని బయటకు తీయడానికి ప్రత్యేక నిజనిర్ధారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తుంది” అని మందకృష్ణ మాదిగ గారు స్పష్టం చేశారు.







