బాపట్ల, సెప్టెంబర్ 21:ఈ నెల 26 నుండి 28 వరకు బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఇంచార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడు అధికారులను ఆదేశించారు.
ఆదివారం ఉదయం డి.ఆర్.ఓతో కలిసి సూర్యలంక బీచ్ ను పరిశీలించిన ఆయన, ఫెస్టివల్ నిర్వహణ కోసం జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బీచ్ ఫెస్టివల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోందని తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పలు అధికారులకు బాధ్యతలు కేటాయించారని పేర్కొన్నారు.
కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని, పనుల పూర్తి తీరును తాను స్వయంగా సమీక్షిస్తానని అధికారులకు సూచించారు. ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని ఆయన ఆదేశించారు.