
బాపట్; డిసెంబర్ 28:-బాపట్ల జిల్లా పాండురంగాపురం, ఓడరేవు ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రం సూర్యలంక బీచ్ గోల్డెన్ సాండ్స్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు. గవర్నర్ గారి రాకతో సూర్యలంక ప్రాంతం సందడి వాతావరణాన్ని సంతరించుకుంది.

గవర్నర్ గారికి జాయింట్ కలెక్టర్ భావన పూల మొక్కలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ గారు అక్కడి పరిసరాలను పరిశీలిస్తూ, పర్యాటక అభివృద్ధి, భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. సూర్యలంక బీచ్‌ను రాష్ట్ర స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలపై చర్చ జరిగింది.Bapatla Local News
ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు, బాపట్ల ఆర్డీఓ పి. గ్లోరియా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విజయమ్మ, డీఎస్పీలు రామాంజనేయులు, జగదీష్ నాయక్, తహశీల్దార్ షేక్ సలీంతో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
గవర్నర్ గారి పర్యటన నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. గవర్నర్ గారి సందర్శనతో సూర్యలంక బీచ్‌కు రాష్ట్ర స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.










