
బాపట్ల జిల్లా;- కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సెగ్మెంట్ పరిధిలోని కొత్త నందాయపాలెం, నల్లమోతువారిపాలెం గ్రామాలలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు, రాష్ట్ర మాజీ సైనికుల అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు నాయకులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు, ఉద్యోగస్తులతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించడంతో పాటు గ్రామాల్లో నిర్వహించిన అవగాహన ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. కొత్త నందాయపాలెం గ్రామంలో ర్యాలీ అనంతరం సర్పంచ్ ఆట్ల వెంకటేశ్వరమ్మ అయ్యప్ప రెడ్డితో కలిసి పారిశుధ్య కార్మికులకు మాస్కులు, గ్లౌజులు, హెల్మెట్లు కలిగిన పారిశుధ్య కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ, ప్రతి నెల మూడవ శనివారం గ్రామాల్లో స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని తెలిపారు. ప్రజలు స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.Bapatla Local News
ఈ కార్యక్రమాల్లో టీడీపీ సీనియర్ నాయకులు ఆట్ల అయ్యప్ప రెడ్డి, నల్లమోతువారిపాలెం టీడీపీ యూనిట్ ఇంచార్జి మాడా శ్రీనివాసరావు, జనసేన ఇంచార్జి గరిగంటి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు షేక్ షాహిన్, ఆట్ల మురళి రెడ్డి, సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.







