

స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేపు శనివారం నిర్వహించే శుభ్రత కార్యక్రమంలో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.శనివారం ఉదయం ఏడు గంటలకే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని, నగర పరిధిలోని ఉద్యోగులందరూ నడక లేదా సైకిల్ పై రావాలని, విజయవాడ వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు వాహనాలను షేర్ చేసుకుని రావాలని సూచించారు. ఏ శాఖల అధికారులు ఏ ఏ కార్యాలయాలను శుభ్రం చేయాలనేది జిల్లా కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు.







