
బాపట్ల :చినగంజం:21-11-25:-కార్తీక మాస వైభవంతో మండలంలోని శివాలయాలు మొత్తం భక్తి సంద్రాలుగా మారాయి. నెల రోజుల పాటు సాగిన కార్తీక పూజల అనంతరం అమావాస్య రోజు నిర్వహించే పోలి స్వర్గానికి పంపే దీపారాధన శుక్రవారం తెల్లవారుజామున ఘనంగా జరిగింది.
స్థానిక శ్రీ బాల కోటేశ్వర ఆలయం ప్రాంగణంలో మహిళలు అట్టిబత్తలపై దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో గల కోనేరులో దీపాలను వదిలే కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధల మధ్య సాగింది. ప్రతి దీపం వెలుగు పోలి స్వర్గానికి చేరే పావన సంకేతంగా భావిస్తూ మహిళలు కుటుంబ శాంతి, శ్రేయస్సు కోరుకుంటూ పూజలు చేశారు.

దీనితో బాల కోటేశ్వర ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయి, కోనేరు పరిసరాలు దీపాల కాంతులతో నిండిపోవడంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రకాశించింది.







