
శ్రీకాళహస్తి: నవంబర్ 10:-కార్తీక మాసం సందర్భంగా ఈనెల 19న జరగనున్న స్వర్ణముఖి నది హారతుల కార్యక్రమానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ విశేషోత్సవం కోసం ఇంజనీరింగ్ విభాగం సన్నాహాలు ప్రారంభించింది.
జల వినాయకుని ఆలయ సమీపంలోని స్నాన ఘట్టాల వద్ద సిమెంట్ కాంక్రీటు పనులు చేపట్టి పరిసరాలను పరిశుభ్రంగా మార్చుతున్నారు. అదేవిధంగా జెసిబీల సహాయంతో స్వర్ణముఖి నది తీర సుందరీకరణ పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి.కార్తీక అమావాస్య సందర్భంగా జరిగే ఈ నది హారతులు పెద్ద ఎత్తున భక్తులను ఆకర్షించే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లను సమగ్రంగా చేస్తున్నారు.







