ఆంధ్రప్రదేశ్గుంటూరు
GUNTUR NEWS: సివిల్ సప్లై కార్మికులకు వేతనాలు పెంచుతూ జీవో విడుదల
AITUC LEADERS PRESS MEET
సివిల్ సప్లై కార్పొరేషన్ లో పనిచేస్తున్న హమాలీల కూలి రేట్లు పెరిగాయి. ఈమేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు సీఎం చంద్రబాబు, మంఊ నాదెండ్ల మనోహర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఏటుకూరు రోడ్ లోని రేగుల రాఘవయ్య భవన్లో ఏఐటీయూసీ నాయకులు చల్లా చిన ఆంజనేయులు, రావుల అంజిబాబు, డి. సురేష్ బాబు, దాసు మీడియాతో మాట్లాడారు. దీర్ఘకాలిక సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయడం ఆనందంగా ఉందన్నారు. జీవో రూపంలో విడుదల చేయడంతో కార్మికులకు ఎంతగానో మేలు జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఏరియర్స్ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి విడుదల చేయాలని సూచించారు.