ఆంధ్రప్రదేశ్
రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించిన ఐ జి త్రిపాఠీ
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఉమేష్ చంద్ర భవనం లో నూతనంగా ఏర్పాటు చేసిన మానవ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ ను గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్రంలో 30 కంప్యూటర్లతో శిక్షణ ప్రారంభిస్తామని ,వీటి ద్వారా కేసు ఛార్జ్ షీట్ తయారు చేయడానికి అవసరమైన కంప్యూటర్ టైపింగ్ , ఇంగ్లీషు పరిజ్ఞానం. కంప్యూటర్ స్కిల్స్ మెరుగుపడటానికి Ms-word, Ms-excel, Ms- power point వంటివి.
పలు చట్టాలపై అవగాహన కల్పిస్తూ కోర్టు మానిటరింగ్ సిస్టమ్స్ ద్వారా కోర్టులలో కేసుల విచారణకు సంబంధించిన మెలకువలను నేర్పించడం జరుగుతుంది అన్నారు.