ఆంధ్రప్రదేశ్

Opartunity: జిల్లాలో ఉన్న యువతి యువకులకు గొప్ప సువర్ణ అవకాశం – పీఎం ఇంటర్న్‌షిప్

ttps://pminternship.mca.gov.in/login/

గుంటూరు జిల్లాలో ఉన్న యువతి యువకులకు గొప్ప సువర్ణ అవకాశం – పీఎం ఇంటర్న్‌షిప్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగముగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది.
గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి శ్రీ కొండా సంజీవరావు గారు మాట్లాడుతూ యువతలో నైపుణ్యాల్ని పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందుకోసమే పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్/స్కీమ్ ను ప్రారంభించారు. ఈ పథకం కోసం అప్లై చేసుకునేందుకు క్రింద తెలుపబడిన లింకు నందు రిజిస్ట్రేషన్ చేసుకోవలెను https://pminternship.mca.gov.in/login/ . దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి SSC పాసైన అభ్యర్థులతో పాటు.. పాలిటెక్నిక్, ఐటీఐ, బీఏ, బీఎస్సీ, బీఫార్మసీ, బీబీఏ వంటి డిగ్రీలు ఉన్న వారెవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి 21-24 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన వారికి సంఘటనల కోసం 6500 వన్ – టైమ్ గ్రాంట్ మరియు భారత ప్రభుత్వం ద్వారా నెలలవారీ సహాయం రూ . 4,500 నుంచి మరియు పరిశ్రమలు ద్వారా రూ. 500 సంవత్సరం పాటు అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇంటర్న్‌షిప్‌లో చేరే వారికి వ్యక్తిగత బీమా సౌకర్యం ఉంది. ఇప్పటికే ఉన్న పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా ఇన్సూరెన్స్ కల్పిస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 10వ తారీకు నుంచి 21వ తారీకు మధ్యలో పై తెలుపబడిన లింకు నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేసినారు . మరిన్ని వివరముల కొరకు ఏపీ ఎస్ ఎస్ డి సి కమాండ్ కంట్రోల్ : +91- 998853335, 8712655686, 8790118349, 8790117279, మరియు సాయి కుమార్ : 8074597926 నంబర్ నందు సంప్రదించగలరు.

గమనిక :
1) ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారి కుటుంబ సభ్యులు
2) వార్షిక ఆదాయం రూ. 8 లక్షలు దాటిన కుటుంబ సభ్యులు అనర్హులు
3) ఉన్నత విద్యాసంస్థల్లో (IIT, IIM వంటివి) గ్రాడ్యుయేషన్ చేసినవారు కూడా అనర్హులు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button