
- ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మద్దులూరి మహేందర్ నాథ్
- పార్టీ అండగా ఉంటుందని భరోసా
చీరాల: నియోజకవర్గానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు, ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షుడు షేక్ మొహిద్దీన్ను టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేందర్ నాథ్ పరామర్శించారు. స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నివాసానికి మంగళవారం స్వయంగా వెళ్లిన మహేందర్ నాథ్.. మొహిద్దీన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొహిద్దీన్ త్వరగా కోలుకుని, మునుపటిలా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనారోగ్య సమయంలో అధైర్య పడవద్దని, ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు.
కష్టకాలంలో కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆయనకు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని మహేందర్ నాథ్ భరోసా ఇచ్చారు. అలాగే, చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య సహాయ సహకారాలు కూడా ఎల్లవేళలా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో అక్కయ్యపాలెం మాజీ ప్రెసిడెంట్ జంగిలి రాముడు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.bapatla news







