
బాపట్ల:29-11-25:-తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కోసం రూ.100/- చెల్లించి ప్రమాద బీమా పథకంలో చేరిన తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కోమట్ల దుర్గా రెడ్డి దురదృష్టవశాత్తు మరణించడంతో, ఆయన కుటుంబ సభ్యులకు టిడిపి తరఫున రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,“దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది” అని తెలిపారు.
టిడిపి కార్యకర్తలే పార్టీ బలం అని పేర్కొన్న ఆయన, పసుపు సైన్యం సంక్షేమం కోసం వందల కోట్లు వెచ్చించిన పార్టీ, కేవలం రూ.100 సభ్యత్వంతోనే రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడం కార్యకర్తల పట్ల పార్టీ ప్రేమకు నిదర్శనమని అన్నారు.కార్యకర్తలతో పాటు వారి కుటుంబ సభ్యుల భద్రత, సంక్షేమం పై శ్రద్ధ చూపే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీయేనని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు పేర్కొన్నారు.







