
హైదరాబాద్ : లింగంపల్లి: 08-11-25:-:-తెలంగాణ బలోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఐదవ పిల్లల జాతర ఉత్సాహభరితంగా, అట్టహాసంగా నిర్వహించబడింది.

ఈ వేడుకకు ప్రభుత్వ అధికారులు, నిర్వాహకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల పోటీలు, క్విజ్‌లు, సైన్స్ ప్రాజెక్టులు వంటి విభిన్న పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ఆవిష్కరించారు. ముఖ్యంగా బోనగిరి సంజన ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం వంటి భారతీయ సాంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
పిల్లల ఉత్సాహం, కళాత్మకతతో ఈ వేడుకలు సందడి వాతావరణాన్ని సృష్టించాయి. చిన్నారుల ప్రదర్శనలను చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. “ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, సామాజిక అవగాహన పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయి” అని వారు అభిప్రాయపడ్డారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వాధికారులకు బోనగిరి సంజన తల్లిదండ్రులు బోనగిరి నరేష్, బోనగిరి స్వప్నలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.





