
బాపట్ల-తెలుగుదేశం పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా పథకం ద్వారా రూ.100 సభ్యత్వంతో రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు తెలిపారు.
బాపట్ల నియోజకవర్గం, బాపట్ల మండలం గుడిపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సభ్యుడు యంపరాల ఆంజనేయులు ప్రమాదవశాత్తు మరణించడంతో, ఆయన కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ తరఫున రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని, పసుపు సైన్యం సంక్షేమం కోసం వందల కోట్లు వెచ్చిస్తున్న ఏకైక పార్టీ టిడిపి అని పేర్కొన్నారు.TODAY BAPATLA NEWS
కేవలం రూ.100తో టిడిపి సభ్యత్వం తీసుకుంటే రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం కార్యకర్తల పట్ల పార్టీకి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. కార్యకర్తలతో పాటు వారి కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని చూసే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీనే అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.







