

గాజుల అలంకరణలో దర్శనమిస్తున్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారు….
ఎన్టీఆర్ జిల్లా/పెనుగంచిప్రోలు…
పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న అతి పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా వివిధ అలంకరణలలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.
దీనిలో భాగంగా ఆదివారం గాజుల అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇస్తున్నారు
ఈ అలంకరణకు కావలసిన లక్ష గాజులను తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం పట్టణానికి చెందిన కావేరి రెస్టారెంట్ అధినేత విష్ణుమూలకల లక్ష్మీప్రసాద్ వెంకట లక్ష్మి దంపతులు అందజేశారు,
ఈ సందర్బంగా అమ్మవారి దర్శనానికి రెండు రాష్ట్రాల నుంచి భక్తులు పోటేత్తారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కార్యనిర్వాన అధికారి సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసారు.







