
- వంతెన నడిమధ్యలో నిలిచిపోయిన లారీ
- అరగంట పాటు ఎండలో అల్లాడిన వాహనదారులు
- బ్రిడ్జిపై తరచూ ఇవే కష్టాలంటున్న స్థానికులు
తెనాలి: పట్టణంలోని మార్కెట్ సెంటర్ నుంచి చెంచుపేట వైపు వెళ్లే ఫ్లైఓవర్‌పై మంగళవారం మధ్యాహ్నం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గుంటూరు వైపు వెళుతున్న ఒక లారీ అకస్మాత్తుగా బ్రేక్‌డౌన్ కావడంతో వంతెన నడిమధ్యలో నిలిచిపోయింది. దీంతో ఇరువైపుల నుంచి రాకపోకలు సాగిస్తున్న వాహనాలు ముందుకు వెళ్లలేక ఎక్కడికక్కడే బారులు తీరాయి.
స్తంభించిన రాకపోకలు.. లారీ నిలిచిపోవడంతో మార్కెట్ వంతెనతో పాటు నాలుగు లైన్ల ప్రధాన రహదారిపై, అటు గుంటూరు మార్గంలో చెంచుపేట వైపు సుమారు అరగంట పాటు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. మిట్ట మధ్యాహ్నం సమయం కావడంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు, ప్రయాణికులు ఎండ తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. సమాచారం అందుకున్న ట్రాఫిక్ మరియు త్రీ టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతి కష్టం మీద వాహనాలను క్రమబద్ధీకరించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అయితే, ఈ ఓవర్ బ్రిడ్జిపై తరచూ ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, అధికారులు దీనిపై దృష్టి సారించాలని పలువురు వాహనదారులు వాపోతున్నారు.http://GUNTUR DISTRICT NEWS







