chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

TENALI NEWS:ఐటీడీపీ నాయకురాలు జెట్టి రేణుకపై అసభ్యకర పోస్టులు- వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి అరెస్ట్!

– బాపట్లకు చెందిన షేక్ సయ్యద్‌కు 14 రోజుల రిమాండ్ – నిందితుడిపై ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో 7కు పైగా కేసులు: సీఐ నాయబ్ రసూల్

తెనాలి రూరల్, మార్చి 4: సోషల్ మీడియా వేదికగా మహిళా నాయకులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర మరియు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న బాపట్లకు చెందిన వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి షేక్ సయ్యద్‌ను తెనాలి రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన ఐటీడీపీ (iTDP) నాయకురాలు జెట్టి రేణుక ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

TENALI NEWS:ఐటీడీపీ నాయకురాలు జెట్టి రేణుకపై అసభ్యకర పోస్టులు- వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి అరెస్ట్!

దుష్ప్రచారంపై పోలీసుల కొరడా

టీటీడీ చైర్మన్‌కు సంబంధించిన ఒక వ్యవహారాన్ని సాకుగా చూపి, జెట్టి రేణుక వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సయ్యద్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన తెనాలి రూరల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అతడిని రెండవ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.

14 రోజుల రిమాండ్

కోర్టులో పోలీసుల తరఫున ఏపీపీ (APP) పరిసపోగు సునీల్ కుమార్ బలమైన వాదనలు వినిపించారు. వాదోపవాదాల అనంతరం న్యాయస్థానం నిందితుడు షేక్ సయ్యద్‌కు 14 రోజుల రిమాండ్ విధించినట్లు రూరల్ సీఐ నాయబ్ రసూల్ మీడియాకు తెలిపారు.

పాత నేరస్తుడే..

నిందితుడు సయ్యద్ గతంలో కూడా ఇలాంటి అనేక చర్యలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. బాపట్ల సహా పలు ఇతర పోలీస్ స్టేషన్లలో ఇతనిపై ఇప్పటికే 7కు పైగా సోషల్ మీడియా కేసులు నమోదై ఉన్నాయని సీఐ వివరించారు. రాజకీయ పక్షపాతంతో మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.http://TENALI NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker