
– 42 మంది లబ్ధిదారులకు రూ. 23.64 లక్షల చెక్కుల అందజేత – పేదలకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం
తెనాలి (గుంటూరు జిల్లా): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం తెనాలి నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు సుమారు 6 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)ని పేద కుటుంబాలకు అందించామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.
శనివారం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీల ప్రాంగణంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలిసి మొత్తం 42 మంది లబ్ధిదారులకు సంబంధించి రూ. 23 లక్షల 64 వేల విలువైన చెక్కులను బాధితులకు అందజేశారు.

పేదలకు ఆరోగ్య భరోసా:
ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ.. అనారోగ్యం బారిన పడి వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంలా మారిందని, వారిని ఆర్థికంగా ఆదుకోవడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి మంచి పనులను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన కోరారు.
పాల్గొన్న నేతలు:
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో పాటు స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. తమ కష్టకాలంలో ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు.GUNTUR NEWS







