
తాడేపల్లి :జనవరి 8:-ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు, వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని బాపట్ల వైఎస్ఆర్సిపి ఇన్‌చార్జ్ శ్రీ కోన రఘుపతి గారు ఈరోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.
పార్టీ అభివృద్ధి, రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై వైయస్ జగన్ గారు కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. జిల్లాలో వైఎస్ఆర్సిపి మరింత బలపడేలా సమిష్టిగా పనిచేయాలని, ప్రజల మధ్యలో పార్టీ కార్యక్రమాలను చురుగ్గా తీసుకెళ్లాలని ఆయన సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.Bapatla Local News
ఈ భేటీ సందర్భంగా కోన రఘుపతి గారు బాపట్ల జిల్లాలో పార్టీ కార్యకలాపాలపై సమగ్ర నివేదికను వైయస్ జగన్ గారికి అందజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో ఈ భేటీపై ఉత్సాహం నెలకొంది.










