
తాడేపల్లి: నవంబర్ 09:-ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాడేపల్లి నులకపేట వద్ద ఉన్న రాష్ట్ర పోలీస్ ఫైరింగ్ రేంజ్‌ను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు నిర్వహించిన ఫైరింగ్ ప్రదర్శనను ఆయన ఆసక్తిగా వీక్షించారు. అనంతరం స్వయంగా గన్ చేతపట్టి ఫైరింగ్‌లో పాల్గొన్నారు.

ఫైరింగ్ రేంజ్‌లో తాను గన్ పట్టిన రోజుల జ్ఞాపకాలు మళ్లీ తలెత్తాయని పవన్ కళ్యాణ్ స్మరించుకున్నారు. పోలీసు సిబ్బందితో స్నేహపూర్వకంగా మాట్లాడిన ఆయన, ఫైరింగ్ శిక్షణలో చూపిస్తున్న నైపుణ్యాన్ని ప్రశంసించారు. రాష్ట్ర భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.







