
గుంటూరు జిల్లా: తాడేపల్లి:-కూటమి ప్రభుత్వం చేపడుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమం” పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం తాడేపల్లి అంజిరెడ్డి భవన్‌లో జరిగింది.ఈ కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ అధ్యక్షులు, పొన్నూరు నియోజకవర్గ పరిశీలకులు బుర్రముక్కు వేణుగోపాలసోమి రెడ్డి, తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా నాగయ్య ఆధ్వర్యంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ —
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేయాలనే నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ ప్రజా ఉద్యమం ప్రారంభమైందని చెప్పారు.
జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన జరగగా, 5 కాలేజీలు పూర్తి అయ్యాయని, మరో 3 తుదిదశలో ఉన్నాయని గుర్తుచేశారు.అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలను పూర్తి చేయడంలో ఆసక్తి చూపడంలేదని, పీపీపీ మోడల్ ద్వారా తన అనుచరులకు లాభాలు చేకూర్చాలన్నదే ఆయన ఉద్దేశమని విమర్శించారు.ప్రభుత్వం పూర్తి చేసిన మెడికల్ కాలేజీలు పేదవారికి సులభ వైద్యం అందించే మార్గమని, ప్రైవేటీకరణ వల్ల ప్రజలు మళ్లీ ఖరీదైన ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజా ఉద్యమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గ కార్యాలయం వద్ద నుంచి గాలిగోపురం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయానికి వినతిపత్రం సమర్పణ చేయనున్నారని చెప్పారు.
ఈ ర్యాలీలో యువజన, విద్యార్థి విభాగాలు, వైఎస్సార్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పాటిబండ్ల కృష్ణమూర్తి, రోడ్డ ఎలీషా, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శులు ముదిగొండ ప్రకాష్, చిన్న పోతుల దుర్గారావు, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి మేక వెంకటరామి రెడ్డి, షేక్ జావిద్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు మేడ వెంకటేశ్వరరావు (పండు), మైనారిటీ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ సలాం, మండల మహిళా అధ్యక్షురాలు నాగ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.







