
గుంటూరు:తాడేపల్లి:04-12-25:-తాడేపల్లి పట్టణంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి సూచనలతో ఈ కార్యక్రమాన్ని పట్టణ అధ్యక్షుడు, పొన్నూరు నియోజకవర్గ పరిశీలకుడు బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా తాడేపల్లి పట్టణ కమిటీ నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా దొంతిరెడ్డి వేమారెడ్డి హాజరయ్యారు. వేదికపై పట్టణ ఉపాధ్యక్షులు జీలగ పెదగాలయ, వేల్పుల ఎలీషా, ప్రధాన కార్యదర్శులు షేక్ సర్దార్, చిట్టిమల్ల స్నేహసంధ్య, జిల్లా యాక్టివ్ కార్యదర్శి సింక గంగాధర్, మహిళా విభాగ అధ్యక్షురాలు దర్శి విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు.నాయకులు మాట్లాడుతూ, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు ఇబ్బందికరమవుతున్నాయని, రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అభిప్రాయపడ్డారు. పార్టీ బలోపేతం కోసం వార్డు స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి 2029లో జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.తరువాత పట్టణంలోని 23 వార్డుల అధ్యక్షులు సేకరించిన సంతకాల పత్రాలను బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డికి అందజేశారు. కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేసిన ప్రతి కార్యకర్తకు పెద్దలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ విభాగాల నాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







