chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విశాఖపట్నం జిల్లా

VISAAKHA NEWS:విశాఖ జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు- కలెక్టర్ సమీక్ష

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే ఈ పరీక్షల కోసం విద్యాశాఖ జిల్లాలో 133 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 28,983 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు.

పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు సమయపాలన పాటించాలని, ఉదయం 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షల సజావు నిర్వహణ కోసం 1,634 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. జిల్లాలోని సమస్యాత్మకమైన 8 పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసి గట్టి నిఘా ఉంచారు.

CHIRALA NEWS
పది విద్యార్థులకు ‘శక్తి’ బృందం దిశానిర్దేశం

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం, హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం 260 మంది స్క్రైబ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు జరుగుతున్న తీరును కలెక్టర్ కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ విద్యాశాఖ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని ఆయన పిలుపునిచ్చారు.http://VISAKHA

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker