ఆంధ్రప్రదేశ్
జనసేనతోనే భవిష్యత్తుకు భరోసా… పెంటేల బాలాజి.
పల్నాడు జిల్లా,చిలకలూరిపేట
సమాజంలో పెరిగిపోతున్న అసమానతలు, దిగజారిపోతున్న ప్రజాస్వామ్య విలువలు చూసి విసుగెత్తి మండే గుండెల పోరాట స్ఫూర్తితో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించటానికి, సమాజంలో మార్పు కోసం పవన్ కళ్యాణ్ ఆలోచనల నుంచి జనసేన పార్టీ ఉద్బవించిందని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి అన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ దశాబ్ద కాల అలుపెరగని పోరాటం, లక్షలాది మంది జనసైనికుల శ్రమకు ఫలితంగా గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జనసేనను చేరుస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని, జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేయడం జనసైనికులకు పండుగ రోజని హర్షం వ్యక్తం చేశారు.