GUNTUR NEWS: గళ్ళా మాధవి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు
CM BIRHDAY IN GUNTUR
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి డివిజన్ లో కేకు కటింగ్ లు, సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేకు ను ఎమ్మెల్యే గళ్ళా మాధవి పార్టీ నేతలతో కలిసి కట్ చేశారు. తొలుత టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాల్లర్పించారు. పార్టీశ్రేణులని ఉద్దేశించి ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… దేశ రాజకీయాలతో పాటు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో చంద్రబాబు చెరగని ముద్ర వేశారని, 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్షనేతగా తన రాజకీయ ప్రస్థానం కొనసాగిందని ఆయన రికార్డు ను ఎవరు చేరపలేరన్నారు. సైబరాబాద్ రూపశిల్పిగా నగరాన్ని విశ్వవేదికపై నిలిపిన చంద్రబాబు, హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దారని, నేడు అమరావతిని నిర్మించిబొతున్న నవ్యాంధ్ర రూప శిల్పి చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కొనియాడారు.అనంతరం లాడ్జి సెంటర్ లో టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన వేడుకలు హాజరయ్యారు. అదేవిధంగా నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు చంద్రగిరి బాబు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గళ్ళా సమావేశం మాధవి ప్రారంభించి, అన్నార్తులకు భోజనాన్ని వడ్డించారు. అరండల్ పేటలో రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కసుకుర్తి హనుమంతురావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి, జోన్ 5 ఇంచార్జీ కోవెలమూడి రవీంద్ర (నానీ)లు కేక్ కటింగ్ నిర్వహించారు. తొలుత గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు.