
విజయవాడ, అక్టోబర్ 17: తిరుపతి జిల్లాలో ప్రముఖులుగా పేరు పొందిన కల్కి ట్రస్ట్ అక్రమంగా ఆక్రమించిన అటవీ భూములపై వెంటనే విచారణ జరిపించాలని భారత హేతువాద సంఘం డిమాండ్ చేసింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని గాంధీనగర్ ప్లేస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య ఈ మేరకు డిమాండ్ చేశారు.
గత మే నెలలో అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రకటనను ప్రస్తావించిన ఆయన, వైసీపీ నేత పెద్దిరెడ్డి అక్రమంగా ఆక్రమించిన అటవీ భూములపై చర్యలు తీసుకోవాలని మంత్రిగారి ఆదేశాలు హర్షణీయం అన్నాడు. అయితే అదే జిల్లాలో కల్కి అనే వ్యక్తి వందల ఎకరాల అటవీ భూములను ఆశ్రమాల పేరిట ఆక్రమించి మోసం చేస్తున్నప్పటికీ, అక్కడి అధికారులపై ఎలాంటి చర్యలు లేకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.”ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయమా?” అంటూ వెంకటసుబ్బయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కల్కి ట్రస్టుతో అధికారులు కలిసి “క్విడ్ ప్రో కో” తరహాలో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయని తెలిపారు.అంజూర్ అటవీ భూముల్లో 21 ఎకరాల ఆక్రమణతిరుపతి జిల్లాలోని బుచ్చినాయుడు కండ్రిక మండలం సర్వే నంబర్ 295లో ఉన్న అంజూర్ అటవీ భూమిలో కల్కి ట్రస్టు అక్రమంగా 21 ఎకరాలను ఆక్రమించినట్టు హేతువాద సంఘం ఆరోపించింది. అనుమతులు లేకుండా ఆశ్రమం పేరుతో భూమిని ఉపయోగిస్తూ మోసం చేస్తున్నారన్నారు. ఈ భూమిని రెవెన్యూ భూమిగా మార్చి, కల్కికి అప్పగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సంఘం తెలిపింది.అలానే, వరదయ్యపాలెం మండలంలో విఠలయ్యపాలెం, బత్తలవల్లం గ్రామాలకు చెందిన సర్వే నంబర్లు 1 నుంచి 7 వరకూ ఉన్న సుమారు 250 ఎకరాల అటవీ మరియు పేదల భూములను కల్కి ట్రస్టు అధీనంలో ఉన్నట్టుగా చూపిస్తూ, అధికారులు పట్టించుకోకపోవడాన్ని సంఘం తీవ్రంగా ఖండించింది.ED అటాచ్మెంట్ ఉన్న భూముల్లో పేర్లు మార్పులు?ఈ భూముల్లో కొంత భాగం ఇప్పటికే ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అటాచ్మెంట్ కింద ఉన్నప్పటికీ, రెవెన్యూ అధికారులు రికార్డులు తారుమారు చేసి పేర్లు మారుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములను ఎలాగైనా కల్కి ట్రస్టుకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని హేతువాద సంఘం స్పష్టం చేసింది.డిమాండ్లు:ఈ నేపథ్యంలో హేతువాద సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా అటవీశాఖ మంత్రికి ఈ క్రింది డిమాండ్లు చేసింది:కల్కి ఆశ్రమ నిర్వాహకులు మరియు సంబంధిత అధికారుల మధ్య ఉన్న అనుమానాస్పద సంబంధాలపై “క్విడ్ ప్రో కో” అంశాన్ని వెల్లడించేలా విచారణ జరిపించాలి.తిరుపతి జిల్లాలో కల్కి అక్రమంగా ఆక్రమించిన అటవీ భూములపై ప్రత్యేక విచారణ కమిటీ వేయాలి.బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, శిక్షించాలి.కల్కి ట్రస్టు ఆధీనంలో ఉన్న భూములను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు రంగారెడ్డి, హేతువాద సంఘం సభ్యులు పూర్ణగాంధీ, జగన్మోహనరావు, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 
  
 






