వెనుకబడిన ఓ బి.సి పేద విద్యార్థులకు కూడా జర్మన్ బాషా శిక్షణ అందిస్తాం :
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
బీఎస్సీ, జిఎన్ఎమ్ కోర్సులు చేసిన SC & ST నర్సులకు జర్మన్ భాషా శిక్షణ : జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్
పేద విద్యార్థులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ కే౦ద్రాన్ని తిరుపతి లో ప్రారంబించడం హర్షణీయం : తిరుపతి ఎం ఎల్.ఎ ఆరణి శ్రీనివాసులు
తిరుపతి, ఆగష్టు 22 : బి.ఎస్.సి, జి ఎన్ ఎం కోర్సులు చేసిన పేద విద్యార్థుల కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా జర్మని లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, వెనుకబడిన ఓ బి.సి పేద విద్యార్థులకు కూడా జర్మన్ బాషా శిక్షణ అందిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
శుక్రవారం సాయంత్రం స్థానిక బాబు జగజ్జీవన్ భవన్ నందు ఎస్సీ, ఎస్టీ నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాష ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. లావణ్య వేణి, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్, జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్, నైపున్యాభివ్రుద్ది శాఖ ఈ.డి మధుసూదన్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్లతో కలసి అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ చిత్రపటాలకు పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రారంభించారు.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు మాట్లాడుతూ …
SC & ST నర్సులకు జర్మన్ భాషా శిక్షణ మరియు నియామక కార్యక్రమం మొదటగా మూడు ప్రదేశాలలో గుంటూరు, విశాఖపట్నం తిరుపతి లలో మొదలు పెడదామని అనుకున్నామని, తర్వాత దానిని 5 ప్రదేశాలలో పెంచాలని ఆలోచనతో తర్వాత కర్నూలు కాకినాడ లలోని మెడికల్ కాలేజీలలో ఏర్పాటు చేశామని ఉన్నారు. జర్మన్ భాష పై శిక్షణ ఇచ్చే ఏజెన్సీ వారు ముందుకు వస్తే 26 జిల్లాలకు కూడా విస్తరింప చేయాలనే ఆలోచనలో ఉన్నామని అన్నారు. జర్మనీ భాష పై నర్సింగ్ విద్యార్థులు పట్టు పెంచుకోవాలని, తెలుగు భాష వలె జర్మనీ భాషని కూడా రాస్తూ అనుక్షణం చదువుతూ దానిపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. మీరందరూ ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే మీ కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలంటే ఆదాయ వనరులు పుష్కలంగా ఉండే జర్మనీ లాంటి దేశాలకు వెళ్లి డబ్బును సంపాదించి మీ కుటుంబ అభివృద్ధికి తోడ్పాటునందించాలని అన్నారు. మీరందరూ సమయం వృధా చేయకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని అందుకు అహర్నిశలు శ్రమించాలని తెలిపారు. ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తోందని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రోజు న ప్రభుత్వం చదువుకునే పిల్లలకు ఎక్సలెన్స్ పేరున 10 సెంటర్లను పెట్టి ఐఐటి నీట్ లాంటి పరీక్షలకు కోచింగ్ ఉచితంగా అందిస్తోందని అన్నారు. నీట్ పరీక్ష తప్పిన విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ ను అందించేందుకు ఎస్సీలు 60 మందికి ఎస్టీలు 20 మందికి కలిపి మొత్తం 80 మందికి కోచింగ్ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో పి- 4 ను ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ను మంత్రి నారా లోకేష్, మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్రం తరఫున ప్రధాని ప్రోత్సహిస్తూ సహకారం అందిస్తున్నారని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన బియ్యం అందిస్తున్నామని, మధ్యాహ్న భోజనంలో కూడా నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి వివిధ పనులు చేసుకుంటున్న వారికి కూడా జర్మనీ భాష నేర్పించి జర్మనీ వెళ్లి ఉద్యోగం చేసుకునేలా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ప్రతి పేద బడుగు వర్గాల వారి ఇళ్లలో వెలుగు చూసేలా విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించే ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా ముఖ్యమంత్రి గారి ఆలోచన దృష్ట్యా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం SC & ST నర్సులకు జర్మన్ భాషా శిక్షణ మరియు నియామక కార్యక్రమం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమము అని మన రాష్ట్రంలో జాబ్ మేళాలు ద్వారా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగాలను కూడా గౌ. ముఖ్యమంత్రివర్యులు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారని ఆ మేరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన మొదటి సంతకం డీఎస్సీ నియామకం అని అన్నారు. డి ఎస్ సి రాత పరీక్ష ఇటీవలే పూర్తయినదని, నియామకాలు కూడా చేపడుతున్నారని అన్నారు. త్వరలో అలాట్మెంట్ కూడా జరుగుతుందని తెలిపారు. మన దగ్గర ఉన్న ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగాలే కాకుండా మరొక అడుగు ముందుకు వేసి ఈరోజు వెల్ఫేర్ మరియు స్కిల్ డెవలప్మెంట్ శాఖలు కలిసి మన ఎస్సీ ఎస్టీ పిల్లలని ఇంకా ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని రెండు ప్రదేశాలైన విజయవాడ, గుంటూరులలో విజయవంతంగా నడుపుతున్నారని అన్నారు. తిరుపతిలో కూడా సుమారుగా రాయలసీమ జిల్లాలలో ఉన్నటువంటి బిఎస్సి నర్సింగ్ జిఎన్ఎమ్ కోర్సులు చేసినటువంటి విద్యార్థులకు ప్రభుత్వం జర్మన్ భాషలో ఉచితంగా శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని తెలిపారు. కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఏదైతే ఏ1, ఏ2, బి1, బి2 పరీక్షలు అన్నీ కూడా జాగ్రత్తగా రాసుకున్నట్లయితే వీసా తో పాటు ఉపాధి అవకాశం కూడా కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా ఉద్యోగ అవకాశం పొందాలంటే ఎగ్జామ్ ఫీజు, వీసా ఖర్చులు అన్నీ కలుపుకొని సుమారు 13 లక్షల దాకా ఖర్చు అవుతుందని, సాధా రణంగా శిక్షణ ఇవ్వడానికి ప్రైవేట్ సంస్థలు 75 వేల దాకా చార్జ్ చేస్తారని ఆ బాధ్యత అంతా కూడా ప్రభుత్వం తీసుకుని బీఎస్సీ నర్సింగ్, జిఎన్ ఎమ్ పూర్తి చేసిన 52 మందిని అప్రూవల్ చేసిందని వారందరూ కూడా చక్కగా శిక్షణ పొంది జర్మనీలో ఉద్యోగ అవకాశం పొందేలా చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. భారతదేశ జనాభా లో 25 నుండి 35 సంవత్సరాల వయసు ఉన్నవారు చాలా ఎక్కువగా ఉన్నారని వెస్ట్రన్ దేశాలతో పోలిస్తే అక్కడ వయసు పైబడిన వారు ఎక్కువ మంది ఉన్నారని కాబట్టి ఇతర దేశాలలో ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉండడంతో వాటిని అందిపుచ్చుకోవడం కోసం మన రాష్ట్రం నర్సింగ్ లో మాత్రమే కాకుండా వివిధ విభాగాలలో యువతకు శిక్షణ అందిస్తూ విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రోత్సహిస్తుందని అన్నారు. మన దేశంతో పోలిస్తే ఇతర దేశాలలో ఆదాయ వనరులు ఎక్కువ కనుక తలసరి ఆదాయం పెరిగే అవకాశం ఉన్నదని అన్నారు. కావున ప్రతి ఒక్కరు భయపడకుండా దృఢ నిశ్చయంతో స్కిల్స్ పెంపొందించుకునీ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
తిరుపతి ఎం.ఎల్ ఏ మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు మంత్రివర్యులు మన నారా లోకేష్ గారు ముగ్గురు కూడా కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకు రావడానికి ఆహర్నిశలు కష్టపడుతూ అందులో భాగంగానే ఈరోజు నైపున్యాభివ్రుద్ది శాఖ, సాంఘిక సంక్షేమం మరియు సామాజిక సంక్షేమం శాఖల సమన్వయంతో ఎస్సీ ఎస్టీ నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాష ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మన మంత్రివర్యులు తిరుపతిలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇది తిరుపతిలోనే కాదు తిరుపతి తో పాటు గుంటూరు అదే విధంగా విశాఖపట్నం మన రాష్ట్రంలో మూడు చోట్ల కూడా ఈ నైపుణ్యాలు భాషా శిక్షణ కేంద్రాలు కూడా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మీ తల్లిదండ్రులకు మీరు ఉపయోగపడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం ఎం నాయక్ మాట్లాడుతూ కొత్త భాష నేర్చుకోవడం వల్ల జ్ఞాపకశక్తి ఆత్మస్థైర్యం మెంటల్ ఎబిలిటీ పరిజ్ఞానం పెంపొందించుకోవడంతోపాటు తెలివితేటలు అభివృద్ధి చెంది అలాగే జర్మన్ లో నర్సింగ్ కొత్త విధానంలో ముందుకెళ్తూ అవకాశాలు అంది పుచ్చుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ విద్యార్థులకు సువర్ణ అవకాశంగా తెలియజేశారు.
సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ బి. లావణ్య వేణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రత్యేక చొరవ తీసుకొని నర్సింగ్ పూర్తి చేసినటువంటి మహిళలు కు, జర్మన్ లో ఉపాధి అవకాశాలను పెంపొందించుకొని వారి జీవన విధానంలో ఆర్థికంగా, సాంఘికంగా, సృజనాత్మకత, పెంపొందించుకుని ,ఎదగడానికి ఈ కార్యక్రమం మంచిగా దోహదపడుతుందని తెలియజేశారు.
ఏపీ ఎస్ ఎస్ డి సి ఎండి తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రం నలువైపుల నుండి నర్సింగ్ చేసిన విద్యార్థులకు జర్మన్ భాష పై ఆరు నెలలు శిక్షణ ఇచ్చి మరియు వారికి జర్మన్ దేశంలో ఉద్యోగ కోసం కల్పించడానికి రాష్ట్రం నందు పలుచోట్ల శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి జర్మన్ భాష పై పట్టు సాధించడానికి ఉచితంగా శిక్షణ ఇచ్చి A1, A2, B1, B2 లెవెల్ లో అర్హత సాధించడానికి అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు.
అనంతరం గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని, బి.ఎస్.సి నర్సింగ్, జి.ఎన్.ఎం విద్యార్థుల వసతి గృహాన్ని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. లావణ్య వేణి, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్, జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్, నైపున్యాభివ్రుద్ది శాఖ ఈ.డి మధుసూదన్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్లతో కలసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ డైరెక్టర్ లు కుమారి , బాబు , సోషల్ వెల్ఫేర్ డి.డి శ్రీ .విక్రమ్ కుమార్ రెడ్డి, డి టి డబ్ల్యూఓ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ శ్రీ.రాజ సోము, టు కమ్స్ ఇన్స్టిట్యూట్ శ్రీమతి. చంద్రిక, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్. లోకనాథం, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిబ్బంది, నాయకులు ప్రజాప్రతినిధులు, మరియు ఏపీ ఎస్ఎస్డిసి సిబ్బంది వారు పాల్గొన్నారు.