
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో “మోంథా” తుఫాన్ సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు అధికారులు ముందుగానే సమన్వయంతో పని చేయడం వల్ల, నగరంలో ప్రధానమైన ఇబ్బందులు తలెత్తకుండా పరిస్థితిని అదుపులో ఉంచగలిగామని చెప్పారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిరంతర పర్యవేక్షణతో పాటు, తక్షణ స్పందనతో పనిచేయడం ద్వారా వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలు, చెట్లు కూలిన ప్రదేశాలు వంటి సమస్యలను వేగంగా పరిష్కరించామన్నారు. అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ సమర్థవంతంగా పనిచేసిందని ఆయన తెలిపారు. GUNTUR NEWS:రాజధానిలో మంత్రి నారాయణ పర్యటన
ప్రజల నుండి అందిన ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి, సంబంధిత విభాగాలకు పంపి పరిష్కార చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలకు తక్షణ ఊరట కల్పించామని అన్నారు. నగరంలో 76 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా సమస్యాత్మక ప్రాంతాల్లోని 30 కేంద్రాల్లో 1943 మంది చేరారని, వారికి ఆహారం, త్రాగునీరు, మౌలిక వసతుల కల్పన చేశామన్నారు. 90 ప్రాంతాల్లో కూలిన చెట్లను తొలగించామని, 50 అడుగులకు పైగా ఎత్తు ఉన్న 6 బోర్డ్ లను, 69 పెద్ద, 123 చిన్న హోర్డింగ్స్ ని తొలగించామన్నారు. GUNTUR CITY NEWS: నగరపాలక సంస్థలో విధులు నుంచి ఇరువురి సస్పెన్షన్
శధిలావస్థలో ఉన్న 71 భవనాలకు నోటీసులు ఇచ్చామన్నారు. తుఫాన్ పరిస్థితుల్లో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్, హార్టికల్చర్ విభాగాలు, ముఖ్యంగా నియోజకర్గాల స్పెషల్ అధికారులైన డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులు, నోడల్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు, ప్రజారోగ్య, ఇంజినీరింగ్ కార్మికులు అంకితభావంతో పనిచేసి తమ కర్తవ్య నిబద్ధతను చూపారన్నారు.
గత నాలుగైదు రోజులుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది, కార్యదర్శులు, కార్మికులు ఒకటే టీమ్‌గా రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో సమన్వయం చేసుకుంటూ కలిసి పనిచేయడం వల్ల తుఫాన్ ప్రభావాన్ని తగ్గించగలిగాం. మరో రెండు రోజులు ఇదే ఉత్సాహంతో కొనసాగితే బాధిత ప్రజలకు మరింత ఊరట కల్పించగలుగుతామన్నారు. అలాగే ముందస్తుగా డ్రైన్లలో పూడికలు, ఆక్రమణల తొలగింపు ద్వారా సమస్యలు తలెత్తకుండా వర్షం నీరు అతి తక్కువ సమయంలోనే బెయిల్ అవుట్ అయిందన్నారు. మొంథా తుఫాన్ మనకు ఏ పరిస్థితినైనా ధైర్యంగా, సమర్థంగా ఎదుర్కొనగల శక్తి ఉందని నిర్ధారణ చేసిందన్నారు. ప్రతి ఒక్కరి కృషి అమూల్యమైనది. ఈ కష్ట సమయంలో ప్రజల కోసం రాత్రింబవళ్లు పనిచేసిన అధికారులు, సిబ్బందికి, ప్రజా ప్రతినిధులకు నగరపాలక సంస్థ నుండి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.







