
బాపట్ల;రేపల్లె:04-11-25:-తాజాగా తుఫాను కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూసిన మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వం నుండి సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మత్స్యకార కుటుంబాలకు బియ్యం, చక్కెర, నూనె, కందిపప్పు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు వంటి అవసరమైన వస్తువులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ పథకం ID ప్రూఫ్ ఉన్న మత్స్యకారులు మరియు Fisherman Amount పొందిన వారికి మాత్రమే వర్తించనుంది. మత్స్యకారులు ఈ సహాయ పథకాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.మత్స్యకారుల సమస్యల పట్ల స్పందించి సహాయం అందించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలిపారు స్థానిక మత్స్యకారులు.అదే సమయంలో, ప్రతి రేషన్ షాపులో ప్రధానమంత్రి మోదీ గారి ఫోటో ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకుడు పిన్ని సాంబశివరావు డిమాండ్ చేశారు.ఇంతటి విపత్తు సమయంలో మత్స్యకారులను ఆదుకున్నందుకు మరోసారి మోదీ గారికి ధన్యవాదాలు తెలిపారు.







