chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్అమరావతి

Amaravathi Local News:తుఫాను నష్టపోయిన పంటలపై అధికారుల నిర్లక్ష్యం – నేతి మహేశ్వరరావు ఆగ్రహం

అమరావతి:06-11-25:-రాజధాని ప్రాంతంలోని పెద్ద పరిమి గ్రామంలో తుఫాను ప్రభావంతో పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కానీ తుఫాను దాటిపోయి రోజులు గడిచినా, అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయడానికి కూడా రాకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు.మహేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కంభంపాటి కృష్ణ, పర్వతనేని హరికృష్ణ, రైతు సంఘ నాయకుడు సాంబశివరావు తదితరులు పంటలను పరిశీలించారు. పంట నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడుతూ మహేశ్వరరావు గారు, “నష్టపోయిన రైతులలో చాలా మంది కౌలు రైతులు. కానీ గ్రామంలోని భూయజమానులు, పెద్దలు వారి సమస్యలను బయటపెట్టకుండా అణచివేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.ఆయన మరోవైపు, “తుఫాను సమయంలో చంద్రబాబు నాయుడు సమన్వయం బాగానే చేసినా, తుఫాను వల్ల నష్టపోయిన రైతులను పూర్తిగా మరిచిపోయారు. రైతుల సగటు వయసు ఇప్పటికే 50 ఏళ్లు దాటింది. ఇలాగే నిర్లక్ష్యం కొనసాగితే భవిష్యత్తులో రైతులు కనిపించరని చెప్పడం అతిశయోక్తి కాదు” అన్నారు.

“ప్రభుత్వం తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి, పూర్తి నష్టపరిహారం ప్రకటించాలి. అభివృద్ధి అంటే కేవలం పారిశ్రామిక అభివృద్ధి మాత్రమే కాదు – వ్యవసాయం కూడా దానికి అంతే ముఖ్యమైన భాగం. కాబట్టి పరిశ్రమలకు ఇచ్చే ప్రాధాన్యత వ్యవసాయానికి కూడా ఇవ్వాలి,” అని ఆయన డిమాండ్ చేశారు.మహేశ్వరరావు గారు కౌలు రైతులకు రుణ సదుపాయాలు కల్పించాలని, పండిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని, పంట నష్టపోయిన రైతులకు పూర్తి పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఇక రైతు నాయకుడు సాంబశివరావును భయపెట్టే ప్రయత్నం జరిగిన నేపథ్యంలో, నేతి మహేశ్వరరావు గ్రామ కేంద్రంలోనే నిరసనకు దిగారు. “రైతును కాపాడాలి – అధికారులు వెంటనే వచ్చి పంట నష్టాన్ని అంచనా వేయాలి – ఎమ్మెల్యే, వ్యవసాయశాఖ మంత్రి గ్రామానికి రావాలి” అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, టిడిపి నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం తుళ్లూరు సిఐ శ్రీనివాస్ రావు పరిస్థితిని సమీక్షించి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. రాత్రి 8:30 గంటలకు వారిని విడుదల చేశారు.మహేశ్వరరావు చివరగా మాట్లాడుతూ, “భూమున్న రైతులమందరం కౌలు రైతులకు పార్టీలకతీతంగా అండగా ఉండాలి. రైతు సమస్యలపై ఐక్యంగా నిలబడితేనే వ్యవసాయం బతుకుతుంది” అన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker