
Bapatla:28-10-25:-బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం మండలంలో తుఫాన్ ప్రభావంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిన్నగంజాం పంచాయతీలోని జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన షెల్టర్‌లో మహాలక్ష్మి కాలనీ, జాలమ్మ కాలనీ మొదలైన ప్రాంతాల నుండి సుమారు 50 మందిని ఉంచారు.ఈ షెల్టర్‌ను డీఎల్పీఓ పద్మావతి గారు, స్పెషల్ ఆఫీసర్ ప్రశాంత్ గారు, ఎమ్మార్వో గారు, ఎంపీడీవో గారు మరియు ఏపీఎం సుబ్బారావు గారు సందర్శించారు. షెల్టర్‌లో ఉన్నవారికి మధ్యాహ్న భోజనాన్ని మండల పార్టీ అధ్యక్షులు పొద వీరయ్య మరియు గ్రామ సర్పంచి చిన్న చేతుల మీదుగా వడ్డించారు.
డీఎల్పీఓ పద్మావతి గారు మాట్లాడుతూ — “ఈ సెంటర్‌లో అన్ని సౌకర్యాలు సక్రమంగా నిర్వహించబడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇంకా ఎవరైనా ఇబ్బంది పడుతున్న వారు ఉంటే వారిని గుర్తించి ఈ సెంటర్‌లో చేర్చాలి. అందరికీ అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు,” అని తెలిపారు.ఈ సందర్భంగా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచించారు.







