
మార్టూరు, నవంబర్ 1 :-తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులను పరామర్శిస్తూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం మార్టూరు, పర్చూరు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. తుపాను వల్ల దెబ్బతిన్న ఇళ్లు, పంటలు, రహదారులను పరిశీలించిన ఆయన బాధిత రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

పర్చూరు, నాగులపాలెం, ఉప్పుటూరు, వీరన్నపాలెం, పోతుకట్ల, కోమర్నేనేనివారిపాలెం గ్రామాల్లో రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే, పంట నష్టాల వివరాలు తెలుసుకున్నారు. వరద ముంపుకు కారణమైన అంశాలపై అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. “వరద కాలువలను పూడిక తీసి ఆధునికరిస్తాం. తుపాను వల్ల ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందిస్తాం” అని ఎమ్మెల్యే ఏలూరి భరోసా ఇచ్చారు.పంటల నష్టపరిహారం హామీవరి, పత్తి, మినుము, పెసర, మొక్కజొన్న, జూట్ పంటలకు తీవ్ర నష్టం జరిగిందని పేర్కొంటూ “ప్రతి నష్టపోయిన రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుంది” అని ఎమ్మెల్యే ఏలూరి స్పష్టం చేశారు.రోడ్ల మరమ్మత్తులకు ఆదేశాలుతుపాను వల్ల దెబ్బతిన్న రహదారులను పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

“ప్రజలకు ఇబ్బంది కలగకుండా రహదారులను త్వరితగతిన మరమ్మతు చేస్తాం” అని తెలిపారు.బర్లీ పొగాకు కొనుగోళ్లపై దృష్టిబర్లీ పొగాకు రైతుల సమస్యలపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు. మిగిలి ఉన్న పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. “రైతుల చరిత్రలో ఇంత విస్తృతంగా పొగాకు కొనుగోళ్లు చేపట్టినది కూటమి ప్రభుత్వమే. ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద మనసుతో చర్యలు తీసుకున్నారు” అని ఏలూరి వివరించారు.పాఠశాల పరిశీలన – వంటగది ప్రారంభంమార్టూరులోని విజయనగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే ఏలూరి సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించి మౌలిక సదుపాయాలను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న తరగతి గదులు, ప్రహరీ నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్కడే కొత్తగా ఏర్పాటు చేసిన వంటగదిని ఎమ్మెల్యే ఏలూరి ప్రారంభించారు.పొట్టి శ్రీరాములకు నివాళిఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ఏలూరి తన క్యాంపు కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం పర్చూరులో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేశారు. “తెలుగువారి ఆత్మగౌరవం కోసం చేసిన త్యాగం స్ఫూర్తిదాయకం” అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.లబ్ధిదారులకు ఎల్‌ఓసీలు అందజేతముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అత్యవసర వైద్యానికి లబ్ధిదారులకు ఎల్‌ఓసీలు ఎమ్మెల్యే ఏలూరి అందజేశారు.బొల్లపల్లి గ్రామానికి చెందిన మొగిలిచర్ల హర్షవర్ధన్ కు రూ.1,00,000, ఇంకొల్లు గ్రామానికి చెందిన లెక్కే శ్రీకాంత్ కు రూ.2,00,000 చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.







