గుంటూరు జిల్లా:తురకపాలెం,:12-10-25:-తురకపాలెం గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న ఆకస్మిక మరణాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సత్వరంగా స్పందించారు. దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించగా, ఆదివారం నాడు ఈ సాయాన్ని స్థానిక ఎమ్మెల్యే బి. రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కలిసి అందజేశారు.
బాధిత కుటుంబాల తరఫున జరిగిన నష్టాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ఆర్థిక సహాయం ప్రకటించడమే కాక, ఆచరణలో పెట్టడంలో దూకుడుగా వ్యవహరించింది.
పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ:”తురకపాలెంలో మెలియోయిడోసిస్ అనే అరుదైన బ్యాక్టీరియల్ వ్యాధి తెలియకుండా వ్యాపించడంతో కొన్ని మరణాలు సంభవించాయి.””ప్రత్యేక నిపుణుల బృందం ద్వారా బ్లడ్ శాంపిల్స్ సేకరించి 61వేల ఆరోగ్య పరీక్షలు జరిపాం.””గుంటూరు జనరల్ హాస్పిటల్‌లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నాం.””ప్రభుత్వం తరఫున బెడ్లు, తాగునీరు, మందులు వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.””మరణించిన వారిలో కుటుంబ పెద్దలు, మధ్య వయస్సు వారు కూడా ఉన్నారు. అవసరమైతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై కూడా మేము సహాయం చేస్తాం.”ఎమ్మెల్యే బి. రామాంజనేయులు గారు అన్నారు:”ఇలాంటి సందర్భాల్లో ప్రజల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.””ఆరోగ్యంపై సరైన అవగాహన లేక కొందరు ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఆలస్యంగా చికిత్స తీసుకోవడం వల్ల దుర్విపరీతాలు జరిగాయి.””మానవతా దృష్టితో, వేరే అనారోగ్య కారణాలతో మరణించిన మహిళకు కూడా ఆర్థిక సహాయం అందించే చర్యలు తీసుకుంటున్నాం.””ప్రభుత్వం తరఫున నిపుణుల పర్యవేక్షణలో పలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాం. సీఎం చంద్రబాబునాయుడు గారి సహకారం లభించిందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.”ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, డీఎంహెచ్ఓ డా. విజయలక్ష్మి, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, నియోజకవర్గ అబ్జర్వర్ వందనాదేవి, ఇతర ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: బకాయిలు చెల్లించకపోతే ట్యాప్ కనెక్షన్ కట్ చేస్తాం
51 minutes ago
Bold Productivity Push: నారాయణ మూర్తి యొక్క ధైర్యవంతమైన 996 సంస్కృతి ప్రణాళిక / Bold Productivity Push|| Narayana Murthy’s Courageous 996 Culture Proposal
53 minutes ago
58th Library Week: Eluru Children’s Library Celebrates an Amazing 7-Day Journey||Amazing58వ లైబ్రరీ వీక్: ఏలూరు బాలల గ్రంథాలయంలో అద్భుతమైన 7 రోజుల ప్రయాణం