
తిరుపతి:28.11.2025:-దామినేడు వద్ద స్పోర్ట్స్ హబ్ నిర్మాణం కోసం 28 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భూ కేటాయింపుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శాప్ చైర్మన్ రవి నాయుడు స్పందించారు.తిరుపతిలో క్రీడా హబ్ ఏర్పాటు కోసం గతంలో స్వయంగా సీఎం చంద్రబాబుకు వినతిపత్రం సమర్పించినట్లు, పలు మార్లు ప్రతిపాదనలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు రవి నాయుడు గుర్తుచేశారు. అలాగే రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అనగాని సత్య ప్రసాద్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ లకు కూడా వివరాలు అందజేసినట్లు తెలిపారు.కేబినెట్ ఆమోదంతో తిరుపతి దామినేడు వద్ద స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు అధికారికంగా మొదలుకానుంది.
ఈ నిర్ణయం “క్రీడాంధ్రప్రదేశ్” లక్ష్య సాధనలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని రవి నాయుడు అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశానికి తిరుపతి ఒక ప్రధాన క్రీడా కేంద్రంగా అవతరించనున్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.







