ఆంధ్రప్రదేశ్
గోవా సీఎంతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి భేటీ..
• ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరగనున్న 4 వ జాతీయ సాగరమాల అపెక్స్ కమిటీ (NSAC) సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి..
• ఈ సందర్భంగా గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కర్నాటక పోర్టుల శాఖ మంత్రి ఎం ఎస్ వైద్యతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి..
• ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో పోర్టుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై చర్చించిన నేతలు..
• ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పాల్గొన్న రాష్ట్ర పెట్టుబడులు & మౌలిక సదుపాయాలు కార్యదర్శి యువరాజ్, ఏపీ మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య , మారిటైం బోర్డ్ సీఈవో ప్రవీణ్ ఆదిత్య..