జాతీయ వార్తలు

బాలికా మేలుకో.. చట్టాలు తెలుసుకో !* నేడు జాతీయ బాలికా దినోత్సవం..

నేడు జాతీయ బాలికా దినోత్సవం

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

నిత్యం ఎక్కడో ఒకచోట బాలికలు, మహిళలపై దాడులు జరుగుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.ఇంటా, బయటా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటున్నారు. ముఖ్యంగా లైంగిక వేధింపులు, దాడులు నిత్యకృత్యంగా తయారయ్యాయి. స్త్రీలు మానసికంగా, శారీరకంగా అనేక రూపాల్లో వేధింపులకు గురవుతున్నారు. అటువంటి దాడులు, వేధింపుల నుంచి రక్షణ పొందేందుకు బాలికలు, మహిళలకు అండగా అనేక చట్టాలు అమల్లో ఉన్నాయి.


సమాజం లోని అసమానతలను తొలగించడానికి, సామాజిక సమతౌల్యాన్ని కాపాడటానికి, బాలికలను సంరక్షించు కోవాల్సిన అవసరం ఉంది. వారికి రక్షణగా ఉన్న చట్టాలను సమర్థంగా వినియోగించు కోగలిగితే స్త్రీ శక్తిని మరే ఇతర శక్తీ అడ్డుకోలేదు. మహిళలకు రక్షణగా ఉన్న కొన్ని ప్రత్యేక చట్టాల గురించి జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మీకు అందిస్తున్న సమాచారం ఇది..

లింగ నిర్థారణ పరీక్షల నిషేధ చట్టం. (1994):

బాలికా మేలుకో.. చట్టాలు తెలుసుకో !* నేడు జాతీయ బాలికా దినోత్సవం..

ఈ చట్టం ప్రకారం మహిళల ఇష్టానికి వ్యతిరేకంగా గర్భ విచ్ఛిత్తికి ఒత్తిడి చేసినట్లయితే శిక్షార్హులు అవుతారు. కుటుంబ సభ్యులు కానీ, ఇతరులు ఎవరైనా కానీ ఆడ శిశువుల భ్రూణ హత్యలకు పాల్పడినట్లయితే ఈ చట్టం ద్వారా మహిళలు రక్షణ పొందవచ్చు. బాధ్యులకు శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ప్రతి ప్రయివేటు ఆసుపత్రుల్లో ఈ చట్టానికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది.

బాలికా మేలుకో.. చట్టాలు తెలుసుకో !* నేడు జాతీయ బాలికా దినోత్సవం..

బాలికా మేలుకో.. చట్టాలు తెలుసుకో !* నేడు జాతీయ బాలికా దినోత్సవం..

బాల్య వివాహాల నిరోధక చట్టం. (2006):

బాలికా మేలుకో.. చట్టాలు తెలుసుకో !* నేడు జాతీయ బాలికా దినోత్సవం..

ఈ చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహం చేయడం నేరం అవుతుంది. బాల, బాలికలను వివాహం చేసుకున్న వారు, చేయించిన వారు, పెద్దలు, ఇరువురి కుటుంబ సభ్యులు ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారు.

వరకట్న నిషేధ చట్టం. (1961):

ఏటా వరకట్న నిర్మూలన దినోత్సవాన్ని జరుపుకొంటుంటాం. వరకట్న నిషేధ చట్టంపై మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 1961లో అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం వివాహానికి ముందు కానీ, తరువాత కానీ వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరం అవుతుంది. కట్నం డిమాండ్‌ చేసిన వారిని కఠినంగా శిక్షించే అవకాశాన్ని మహిళలకు ఈ చట్టం కల్పిస్తోంది.

పోక్సో చట్టం. (2012):

ఈ చట్టం ప్రకారం పని చేసే ప్రదేశాల్లో పసి పిల్లలను, ఆడపిల్లలను లైంగిక వేధింపులకు గురి చేస్తే దాన్ని నియంత్రించే హక్కును కల్పించింది. దీనినే పోక్సో చట్టం అంటారు.

గృహ హింస నిరోధక చట్టం. (2005):

ప్రకారం ఇంట్లోని మహిళలపై జరిగే మానసిక, శారీరక దాడులు, హింస ను అరికట్టాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చింది. ఈ చట్ట ప్రకారం మహిళలకు హాని కలిగించినా, భావోద్వేగపూరిత మాటలతో దూషించినా, వరకట్నం కోసం వేధించినా, ఆమె ఆస్తులను స్వాధీనపరచు కోవాలని ప్రయత్నించినా నేరం అవుతుంది. బాలికలు, స్త్రీల సంరక్షణకు మనోవర్తిని కూడా పొందవచ్చు. ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు పోలీసులు, న్యాయస్థానాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించి న్యాయం పొందవచ్చు.

నిర్భయ చట్టం. (2013):

దిల్లీ లో జరిగిన సంఘటన నేపథ్యంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఆడపిల్లలు, మహిళలపై లైంగిక దాడులు, యాసిడ్‌ దాడులు, లైంగిక వేధింపులు, కిడ్నాప్‌లు, హింస వంటి సంఘటనలు ఈ చట్టం పరిధి-లోకి వస్తాయి. ఈ చట్టం ప్రకారం కేసు నమోదు అయితే కఠినంగా శిక్షలు ఉంటాయి.

హిందూ వారసత్వ చట్టం. (1956):

ఈ చట్టాన్ని ప్రభుత్వం మళ్లీ 2005 – 06 లో సవరించింది. ఆర్థిక సమానత్వాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన చట్టం ఇది. మహిళలకు తండ్రి ఆస్తి లో మగ పిల్లలతో పాటు సమాన వాటాను పొందే అవకాశం ఉంది. ప్రతి ఆడపిల్లకు జన్మాంతం ఆస్తిలో సమాన హక్కును కల్పించారు. బాలల న్యాయ పోషణ రక్షణ చట్టం. (2015): ఈ చట్టం ద్వారా బాలికలకు అవసరమైన రక్షణ, వసతి, పోషణ కల్పిస్తారు.

మహిళలపై అసభ్య ప్రవర్తన నిరోధక చట్టం:

ఈ చట్టం ప్రకారం మహిళలను కించ పరిచేలా మాట్లాడినా, వారి పట్ల అసభ్య కరంగా ప్రవర్తించినా శిక్షార్హులవుతారు. మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించేలా బొమ్మలు, ప్రదర్శనలు, రాతలు, నగ్న చిత్రాలు వంటివి ప్రదర్శించినా నేరం అవుతుంది. ఐపీసీ 509, 354 (ఏ,బీ,సీ,డీ) సెక్షన్ల ప్రకారం ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం నేరంగా పరిగణిస్తారు.

ర్యాగింగ్‌ నిషేధ చట్టం:

ఈ చట్టం అమలు లోకి వచ్చిన తరువాత విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ భూతం ఆట-కట్టించినట్లు అయింది. బాల, బాలికలను అనుచిత ప్రవర్తనలతో ర్యాగింగ్‌ చేసి వారిని ఇబ్బందులకు గురి చేయడం నేరం అవుతుంది. ఈ చట్టం విద్యాభ్యాసానికి అనువైన చక్కటి వాతావరణం కల్పించింది.

న్యాయ సేవాధికార చట్టం. (1987):

ఈ చట్టం ప్రకారం బాలికలందరూ న్యాయ సహాయం పొందటానికి అర్హులు.

సమాన వేతన చట్టం:

1976 లో ఈ చట్టాన్ని చేశారు. దీని ప్రకారం స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. లింగ వివక్ష ఆధారంగా స్త్రీ వేతనాలు తగ్గించడం నేరం అవుతుంది. ఒకే పనిని స్త్రీ, పురుషులు ఒకేలా చేస్తే ఇద్దరికి సమాన వేతనం కల్పించాలని ఈ చట్టం చెబుతోంది…

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker