
కృష్ణా జిల్లా, అక్టోబర్ 17:-ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) గుడివాడ బ్రాంచ్ మరియు ఏపీ వాలంటరీ బ్లడ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో గుడివాడలో ఉచిత మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించబడింది.

గుడివాడ ఐఎంఏ హాల్లో నిర్వహించిన ఈ శిబిరాన్ని ఐఎంఏ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గుడివాడ పట్టణంలో రక్త నిల్వలు పెంపొందించేందుకు మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి యువత, కళాశాల విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా” అని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ పొట్లూరి వంశీ, డాక్టర్ సోమూరి రాజా, డాక్టర్ పిన్నమనేని రామకృష్ణ ప్రసాద్, ఎం. సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.రక్తదానం చేసే సాంఘిక బాధ్యతను యువతలో పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింతగా జరగాలని పలువురు అభిప్రాయపడ్డారు.







