
బాపట్ల: పర్చూరు: చిన్నగంజాం ;-రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని పర్చూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు అన్నారు. ఒక్కరోజే 1.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రాష్ట్ర రికార్డు నెలకొల్పిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.రైతులు ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే నగదు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, ఎలాంటి ఆలస్యం లేకుండా పారదర్శక విధానంతో కొనుగోళ్లు సాగుతున్నాయని తెలిపారు. వైసీపీ పాలనలో పెండింగ్‌లో పెట్టిన రూ.1,674 కోట్ల బకాయిలను పూర్తిగా చెల్లించామని చెప్పారు.
రైతులను మోసం చేసిన వైసీపీ – కూటమి పాలనలో భరోసాగత ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి రైతును తీవ్రంగా నష్టపరిచారని ఎమ్మెల్యే ఏలూరి తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు, దళారుల రాజ్యం నడిపి రైతులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు.
ధాన్యం అమ్మిన రైతులు నెలల తరబడి డబ్బుల కోసం తిరగాల్సిన దుస్థితి వైసీపీ హయాంలో ఏర్పడిందన్నారు.
2025–26 ఖరీఫ్‌లో భారీ లక్ష్యంకూటమి ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో
2025–26 ఖరీఫ్ సీజన్‌లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని
రూ.12,200 కోట్ల విలువతో కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
ఇప్పటివరకు3.24 లక్షల మంది రైతుల నుంచి20.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణరూ.4,609 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు వెల్లడించారు.
ఏఐ ఆధారిత సేవలు – రైతుకు సులువైన విధానంధాన్యం అమ్మదలిచిన రైతులు 73373-59375 నెంబర్‌కు “హాయ్” అని సందేశం పంపితే,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వాయిస్ మార్గదర్శకం ద్వారా పూర్తి సమాచారం అందేలా ప్రభుత్వం సౌకర్యం కల్పించిందని ఎమ్మెల్యే తెలిపారు.
వైసీపీ పాలనలో రైతు ఆత్మహత్యలువైసీపీ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మానవ హక్కుల సంఘాలు, రైతు స్వరాజ్య వేదిక నివేదికల ప్రకారంగత ఐదేళ్లలో 2552 మంది రైతులు ఆత్మహత్యలుసంవత్సరానికి సగటున 400 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
‘అన్నదాత సుఖీభవ’తో రైతుకు ఆర్థిక భరోసాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రెండు విడతలుగారూ.6,310 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసి46 లక్షల మంది రైతులకు ఆర్థిక భరోసా కల్పించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Bapatla Local Newsపండ్లు, చేపల ఉత్పత్తిలో దేశంలో ఏపీ నంబర్ వన్ఆర్‌బీఐ విడుదల చేసిన 2024–25 గణాంకాల ప్రకారం1.93 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తితో దేశంలో ఏపీ మొదటి స్థానం51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో దేశంలోనే అగ్రస్థానం సాధించిందన్నారు.
మద్దతు ధరలతో రైతుకు గిట్టుబాటుకూటమి ప్రభుత్వం
మామిడి, పొగాకు, మిర్చి, కాఫీ, ఉల్లి, టమాటా వంటి పంటలకు
మద్దతు ధరలు ప్రకటించి రూ.850 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసి గట్టి భరోసా కల్పించిందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా, ఉత్పత్తి నుంచి విక్రయం వరకూ ప్రతి దశలో రైతుకు అండగా నిలబడటమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.







