
బాపట్ల: 21-11-25:-కొండుబొట్లు వారిపాలెం గ్రామానికి చెందిన జనసైనికుడు కూనపురెడ్డి ఉమామహేశ్వరరావు క్యాన్సర్ వ్యాధితో కన్నుమూశారు. జీవితంలో చివరి కోరికగా జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలవాలని ఆకాంక్షించిన ఆయన, ఆ కోరిక నెరవేరకుండానే మృతిచెందడం కుటుంబ సభ్యులను, పార్టీ కార్యకర్తలను విషాదంలో ముంచెత్తింది.
మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ బాపట్ల నియోజకవర్గ జనసేన నాయకుడు విన్నకోట సురేష్, ఉమామహేశ్వరరావు కుమారుడి విద్యాభారాన్ని స్వీకరించారు. అదే విధంగా నల్లమోతువారి పాలెం గ్రామ నాయకులు గరిగంటి సుధీర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు గరిగంటి శ్రీనివాసరావుతో కలిసి కుటుంబానికి అవసరమైన ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో బాపట్ల రూరల్ జనసేన మండల అధ్యక్షుడు దాసరి ఏసుబాబు, కర్లపాలెం మండల అధ్యక్షుడు గొట్టిపాటి శ్రీకృష్ణ, జనసైనికులు తాండ్ర రాధాకృష్ణ, సాయిన రాంబాబు, గుర్రాల వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు.ఉమామహేశ్వరరావు ఆకాల మృతి పార్టీ శ్రేణుల్లో దిగ్భ్రాంతిని కలిగించింది.







