chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Mangalagiri Local News :ఉండవల్లిలో కుంభకోణం కాఫీ షాప్ ప్రారంభం

మంగళగిరి:-మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఉండవల్లి దేవుడు మాన్యం వద్ద కుంభకోణం కాఫీ షాప్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు, దీక్ష మీడియా చైర్మన్ జొన్న రాజేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కాఫీ షాప్‌ను ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) చైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గంలో కుంభకోణం కాఫీ షాప్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. షాప్ నిర్వహణలో నాణ్యత, పరిశుభ్రతతో పాటు వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ప్రమాణాలు పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ఇటువంటి వ్యాపారాలు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో దోహదపడతాయన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు, మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, ఏంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి మారుతి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ట్రస్ట్ బోర్డు సభ్యులు బళ్ల ఉమామహేశ్వరరావు, ఉండవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జొన్న శివశంకర్, బడే సాంబశివరావు, సాధు చంద్రశేఖర్, అంబటి తిరుపతిరావు, చాముండేశ్వరి దేవి పాల్గొన్నారు.managalagiri news

అలాగే జనసేన పార్టీ ఉండవల్లి గ్రామ అధ్యక్షులు రాజా రమేష్, వీరిశెట్టి వెంకటేశ్వరరావు, దినేష్ చక్రవర్తి, తెలుగుదేశం పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు దాసరి కృష్ణ, టిడిపి ఉండవల్లి గ్రామ అధ్యక్షులు నరేంద్ర, నాయకుల తోట సాంబశివరావు, బసివి రెడ్డి, లింగంశెట్టి కిషోర్, జంగాల సాంబశివరావు, రోటరీ క్లబ్ ప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker