
బాపట్ల నియోజకవర్గం

పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో బాజీ బేగ్ s/o అలీ బేగ్ గారి ఇల్లు గత రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధం అవ్వడంతో ఈ విషయం తెలుసుకున్న బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ గారు మరియు ex రైల్వే బోర్డు మెంబర్ ఎస్ ఎస్ మోహాసిన్ నియాజీ గారు ఘటనా స్థలానికి వెళ్లి ఇంటి స్థితిని పరిశీలించి బాధితులను పరామర్శించి వారికి జనసేన పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించారు వారికి ఎప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పిట్ల వానిపాలెం మండల అధ్యక్షులు హుస్సేన్ బేగ్ (దాదా), సయ్యద్ నిజాం,షేక్ రఫీ, సయ్యద్ అన్సారీ, చల్లపల్లి ఏసోబు, జిడుగు రాజేష్, మరియు జనసేన నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.







