

కర్లపాలెం మండలం నల్లమోతు వారి పాలెం గ్రామ పంచాయతీ ఆవరణలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పై జరిగిన ప్రత్యేకమైన గ్రామ సభలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (పని పథకం) గురించి మరియు గ్రామాలలో ఉపాధిహామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవటం వలన గ్రామ ప్రజలతో పాటు గ్రామానికి కలిగే ప్రయోజనాల గురించి కూడా గ్రామస్తులకు వివరించి, పని పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని తెలియ జేసిన ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు మరియు రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు

. గ్రామ సభలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క జాబితాను సవరించి, మరణించిన మరియు అనర్హుల పేర్లను జాబితా నుండి తొలగించే విధంగాను మరియు అర్హులైన గ్రామస్తులకు పని పథకాన్ని కల్పించే విదంగా ను నిర్ణయాలు తీసుకోవటం జరిగినట్లు ఎంపీటీసీ తాండ్ర తెలియ జేశారు.
గ్రామ సభలో సర్పంచ్ మాడా సుబ్రహ్మణ్యం, సెక్రటరీ షేక్ షాహినా, టీడీపీ ఇంచార్జి మునిపల్లె చిన్న, గ్రామ పెద్దలు మాడా శ్రీనివాసరావు, జనసేన శ్రీనివాసరావు మొదలగు వారు పాల్గొన్నారు.








