
హైదరాబాద్: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఆర్.సి. రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్‌కు చెందిన అభ్యర్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది ఫలితాల్లో స్టడీ సర్కిల్‌కు చెందిన విద్యార్థులు 60కు పైగా ర్యాంకులు సాధించినట్లు స్టడీ సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ సంఘమిత్ర తెలిపారు.

ఈ సందర్భంగా స్టడీ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో 259వ ర్యాంక్ సాధించిన వర్షిత్ రెడ్డి, 768వ ర్యాంక్ సాధించిన కుమ్మరి శ్రవణ్ కుమార్‌లతో కలిసి ఆమె మాట్లాడారు. మూడో ప్రయత్నంలో తాను యూపీఎస్సీ ర్యాంక్ సాధించానని, ప్రస్తుతం జీఎస్టీ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్నట్లు వర్షిత్ రెడ్డి తెలిపారు. ఈ విజయాన్ని సాధించడంలో ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్ ఫ్యాకల్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. తనలో ఉన్న లోపాలను గుర్తించి సరిదిద్దుకునేలా మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు.

ఇంటర్వ్యూ దశలో కూడా ఇక్కడి ఫ్యాకల్టీ సమగ్ర మార్గదర్శకత్వం అందించిందని కుమ్మరి శ్రవణ్ కుమార్ తెలిపారు. తల్లిదండ్రులు మరియు ఫ్యాకల్టీ సహకారంతోనే ఈ ర్యాంక్ సాధించగలిగానని ఆయన చెప్పారు. యూపీఎస్సీ అభ్యర్థులకు ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్ అందిస్తున్న శిక్షణ, మార్గనిర్దేశం వల్లే ఈ విజయాలు సాధ్యమవుతున్నాయని సంఘమిత్ర పేర్కొన్నారు.Hyderabad naampalli







