బాపట్ల, సెప్టెంబర్ 13 :శనివారం జిల్లా కేంద్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో
ఉన్న మార్క్ఫెడ్ స్టాక్ స్టోర్ చేసే అవేజ్ గౌడౌన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ఇంతవరకు ఎంత యూరియా వచ్చింది, రైతు సేవా కేంద్రాలకు, పిఏసీఎస్, డిసిఎమ్ఎస్ లకు ఎంత యూరియా పంపించారు, గతేడాదికన్నా ఎక్కువ వచ్చిందా, తక్కువ వచ్చిందా, ఎంత నిల్వ ఉంది, యూరియా పంపిణీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా తదితర వివరాలను వ్యవసాయ అధికారుల ను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
అవేజ్ గౌడౌన్ నుంచి రైతు సేవా కేంద్రాలకు, పిఏసీఎస్, డిసిఎమ్ఎస్ లకు యూరియా పంపించడంపై దృష్టి సారించాలన్నారు. సీఎంఏఐడి యాప్ ద్వారా రైతులకు యూరియాను అందజేయాలని,రైతులు యూరియా కొనుగోలులో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే లేదా అధిక ధరల అమ్మకాలుకు సంబంధించి రైతులు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలని రైతులకు చూచించారు.ఎరువుల కోసం వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
2,276 Less than a minute