
బాపట్ల :కర్లపాలెం, అక్టోబర్ 12: మండలానికి చెందిన యువ శాస్త్రవేత్త ఎం.ఎం. బేగ్ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లుపోలీసు రావు అన్నారు
ఆదివారం నాడు పోలీసులు రావు గారు బేగ్ గారి నివాసాన్ని సందర్శించి, ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మాట్లాడుతూ, భారతదేశపు పట్టు పరిశ్రమలో శాస్త్రవేత్తగా పని చేస్తూ డాక్టరేట్ పొందిన ఎం.ఎం. బేగ్ ఇటీవల జపాన్ లో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ‘యంగ్ సైంటిస్ట్ అవార్డు’ను భారతదేశ తరఫున అందుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు.
బేగ్ గారు కర్లపాలెం మండలానికి చెందినవారు కావడం ఈ ప్రాంత ప్రజలందరికీ గర్వకారణంగా ఉందని అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అనేకమంది గ్రామ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.







