Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకామారెడ్డికృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్గుంటూరు

Guntur local news:ఉండవల్లిలో మంత్రి లోకేష్ సమీక్ష – ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు ఊరట, రేపటి కేబినెట్‌లో క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ

ఉండవల్లిః 09-10-25;ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు త్వరలోనే పెండింగ్ రాయితీలు చెల్లించేందుకు అవసరసమైన చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. స్టార్టప్ ల వృద్ధిలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ ను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలి. మరో రెండు నెలల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వెయ్యి సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీపైనా సమావేశంలో చర్చించారు. రేపటి కేబినెట్ సమావేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీని ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్, ఇన్నోవేషన్ సొసైటీ, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ పైనా సమావేశంలో చర్చించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button