
గన్నవరం, అక్టోబర్ 21:విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలోని వైయస్ఆర్ బొమ్మ సెంటర్ వద్ద, అంబాపురం గ్రామ వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు నల్లమోతు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు కోడాలి ప్రవీణ్, పలపాక మరియదాసు, పైడిముక్క రమేష్, తోడేటి కిరణ్ కుమార్, కొడాలి భారత్, మంచాల విజయ్, సొంగ దయాకర్, ప్రభాకర్, రవితేజ, సాయి తదితరులు పాల్గొన్నారు.

వల్లభనేని వంశీ అభిమానులు, మహిళలు, పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరై, కేక్ కట్ చేస్తూ హర్షాతిరేకంగా వేడుకలను నిర్వహించారు.
వంశీమోహన్ గారు ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడుతూ, ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని అభిమానులు ఆకాంక్షించారు.
 
  
 






